పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలకు మరింత గుర్తింపు తెచ్చేందుకు నిర్ణయించారు. ఇందుకుగాను ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత డబ్బులు కేటాయించనున్నట్లు తెలిపారు. లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను పవన్ కళ్యాణ్ పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని అధికారులకు పవన్ సూచించారు.