Top 10 viral news 🔥
పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. ట్విస్ట్ ఇదే!
ఉత్తర ప్రదేశ్లో భర్తలు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక వారి నుంచి విడిపోయి కవిత, గుంజ అనే ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. గోరఖ్ పూర్ జిల్లాకు చెందిన వీరిద్దరికి 4ఏళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. కొన్ని నెలలుగా ఒకే గదిలో ఉంటున్నారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేమని తెలుసుకొని ఓ ఆలయంలో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. గుంజా తన పేరును బబ్లూగా మార్చుకుని తనకు భర్తగా ఉంటుందని కవిత చెప్పింది.