తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌లో నీళ్లే మొదటి అంశమని BRS మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 'గోదావరి బేసిన్‌లో మనకు హక్కుగా రావాల్సిన నీళ్లపై అడగట్లేదు. 'పోలవరం' కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నాన్నారు. బనకచర్ల ద్వారా రాయలసీమకు 200 TMCలు తరలిస్తమంటే పట్టించుకోవడం లేదు. తుంగభద్ర నీళ్లకు ఏపీ, కర్ణాటక గండికొడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నారా?' అని ప్రశ్నించారు.