తెలంగాణ నుంచి సైబర్ కమాండో శిక్షణ కోసం ఒకే ఒక్కరు ఎంపిక
సైబర్ కమాండో శిక్షణ కోసం తెలంగాణ నుంచి ఒకే ఒక్కరు ఎంపికయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో డిప్యూటీ అనలిటికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు ప్రశాంత్ కుమార్. బీటెక్ సీఎస్ఈ చదివిన ప్రశాంత్ కుమార్‌కు సాంకేతికతపై పట్టు ఉండటంతో, కానిస్టేబుల్‌గా ముందు నుంచీ సైబర్ నేరాల విభాగంలోనే ఉన్నారు. సైబర్ కమాండో శిక్షణ కోసం ప్రశాంత్ ఇప్పటికే కేరళకు వెళ్లారు.