మరోసారి క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు
TG: ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు మరోసారి క్షమాపణలు చెప్పారు. దాడిలో గాయపడిన జర్నలిస్ట్ రంజిత్‌ను ఆయన తాజాగా కలిశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్‌ను, ఆయన కుటుంబాన్ని కలిసిన మోహన్ బాబు వారికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మీడియాపై దాడి కేసులో ఆయనపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే.