AP: 2027లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. విశాఖలో ఆదివారం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల సంఖ్య పెరుగుతుందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా వైసీపీ శ్రేణులు భయపడవద్దని భరోసా ఇచ్చారు.