భార్య వేధింపులు తాళలేక టెకీ ఆత్మహత్య చేసుకొన్న కేసులో ఆయన భార్య నిఖితాను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ‘నా మనవడు ఎక్కడ’ అంటూ అతుల్ తండ్రి పవన్ కుమార్ మోడీ కోడలు నిఖితాను ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘2020లో అతుల్‌కు కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత నిఖితా, నా కుమారుడు విడిపోయారు. నాటి నుంచి నా మనవడిని చూడలేదు. నా దగ్గర ఉంటేనే అతడు క్షేమంగా ఉంటాడు’ అని అతుల్ తండ్రి వాపోయారు.