AP: కాకినాడలో కుడా చైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. ఘటన సమయంలో వేదికపై ఎమ్మెల్సీ యనమల, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, రాజప్ప తదితరులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాంతో నేతలకు పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.