స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన యువజన క్రీడా పోటీలకు ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. యువజన క్రీడోత్సవాలకు సంబంధించి పోటీల నిర్వహణ, తదితర అంశాలపై ప్రణాళిక తయారు చేసేందుకు ముందస్తు సమావేశాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు.