రేపటి నుంచే జేఈఈ మెయిన్స్ పరీక్షలు
జేఈఈ మెయిన్-2025 సెషన్-1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశ పరీక్షలు ఈ నెల 22 నుంచి 24 వరకు, రెండో దశ పరీక్షలు 28 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్ష రాసే విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను NTA అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
వెబ్సైట్: https://jeemain.nta.nic.in/