అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో అప్‌డేట్‌ను ఇచ్చారు. ఈ సినిమాలోని మూడో సింగిల్ ‘హైలెస్సో హైలెస్స’ అంటూ సాగే మెలోడీని జనవరి 23న రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.