పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణా జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ మేనల్లుడిపై అత్యాచారం చేసిన 28 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తన మైనర్ మేనల్లుడితో నిత్యం ఆమె అసభ్యంగా ప్రవర్తించేదని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇదంతా వీడియోలు తీసి అతడిని బ్లాక్ మెయిల్ చేసేదని పోలీసులు తెలిపారు. చివరికి ఆ బాలుడు జరిగినదంతా తన తల్లికి చెప్పడంతో ఈ విషయం బయటపడింది.