‘గేమ్ ఛేంజర్’ సినిమా థియేటర్ సీజ్ (వీడియో)
AP: లైసెన్స్ లేకుండా సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌ను అధికారులు సీజ్ చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఉన్న జీఎం పిక్చర్ ప్యాలెస్‌లో ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ థియేటర్‌కు లైసెన్స్ లేకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. దాంతో గేమ్ ఛేంజర్ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. థియేటర్‌కు వచ్చిన రామ్ చరణ్ అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.