VIDEO: మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు
AP: విశాఖలోని పీఎం పాలెంలో దారుణం చోటు చేసుకుంది. మిథిలాపురి వుడా కాలనీలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న మహిళపై.. పక్కనే ఉన్న ఇతర దుకాణదారులు దాడి చేశారు. ఆ మహిళను రోడ్డు మీదకు ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలయింది. వీడియో చూసిన పలువురు వారిపై మండిపడుతున్నారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తామని పోలీసులు తెలిపారు.