సీజ్​ఫైర్ డీల్​ బ్రేక్.. లెబనాన్​పై ఇజ్రాయెల్​ దాడిలో 22 మంది మృతి

55చూసినవారు
హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల ఒప్పందం(సీజ్​ఫైర్) ఉల్లంఘనకు గురైంది. దక్షిణ లెబెనాన్‌లో ఆదివారం ఇజ్రాయెల్‌ దళాలు జరిపిన కాల్పుల్లో 22 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 124 మందికి పైగా గాయాలపాలయ్యారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం దక్షిణ లెబెనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌ సైన్యం వైదొగాలి. కానీ, గడువు దాటినా ఇంకా నెతాన్యాహు తమ దళాలను ఉపసంహరించలేదు. ఇజ్రాయెల్‌ వైదొలగడానికి మరింత సమయం కోరుతోంది.

సంబంధిత పోస్ట్