ఉత్తరాఖండ్‌లో అమల్లోకి వచ్చిన ఉమ్మడి పౌరస్మృతి

66చూసినవారు
ఉత్తరాఖండ్‌లో అమల్లోకి వచ్చిన ఉమ్మడి పౌరస్మృతి
దేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమల్లోకి వచ్చింది. ఆ రాష్ట్ర సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించారు. ‘యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుంది. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తాం’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇది ఏకాభిప్రాయం లేని ప్రయోగాత్మక ప్రాజెక్టు అని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

సంబంధిత పోస్ట్