AP: కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో అవసరమైన చోట మిగులు సిబ్బందితో కొత్త సచివాలయాలు ఏర్పాటు చేయనుంది. 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలోని ఆవాస ప్రాంతాలను తొలగించి సమీప సచివాలయాల్లో చేర్చనున్నారు. నాలెడ్జ్ హబ్‌లుగా సచివాలయాలను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. నైపుణ్య అభివృద్ధి, ఏఐ అనుసంధానంతో సూక్ష్మ చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా ప్రజలను ప్రోత్సహించడంతో పాటు ఉపాధి కల్పన తదితర అంశాల్లో శిక్షణ అందించనున్నారు.