Top 10 viral news 🔥
ఏపీలో ఉచిత బస్సు పథకం.. డేట్ ఫిక్స్?
AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీన్ని సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్ రావు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్రీ బస్ వల్ల నష్టపోకుండా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం విధివిధానాలు రూపొందించే పనిలో ఉందని వెల్లడించారు.