పింఛన్లపై శుభవార్త చెప్పిన ప్రభుత్వం
AP: ఎన్టీఆర్ భరోసా పింఛన్లలో స్పౌజ్ కేటగిరీని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేర్చింది. పింఛన్ పొందుతున్న వ్యక్తి చనిపోతే.. అతని భార్యకు ఈ కేటగిరీ కింద మరుసటి రోజు నుంచే పింఛన్ అందజేస్తుంది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు గుర్తించిన 5,402 మందికి మంగళవారం పింఛన్ అందజేయనుంది. అలాగే వివిధ కారణాలతో 2 లేదా 3 నెలలు పింఛన్ తీసుకోని 50 వేల మందికి రేపు ప్రభుత్వం పింఛన్ ఇవ్వనుంది.