AP: నూతన సంవత్సరం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో రేవ్‌పార్టీ కలకలం రేగింది. కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలోని కల్యాణ మండపంలో ఇశాళ తెల్లవారుజామున రేవ్ పార్టీపై పోలీసు ప్రత్యేక సిబ్బంది దాడి చేశారు. ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి చెందిన వారిగా గుర్తించారు. వారంతా గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలిసింది. కేసు నమోదు చేశారు.