ఉద్యోగం అంటే బాధ్యత మాత్రమే కాదు.. ఒక ఉద్వేగం: సీఎం రేవంత్
గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఏళ్ల కొద్దీ సాగదీసి, నిరుద్యోగులకు అన్యాయం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆదివారం నిర్వహించిన 'కొలువుల పండుగ' కార్యక్రమంలో 1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాలను సీఎం అందజేశారు. ఉద్యోగం అంటే బాధ్యత మాత్రమే కాదు, ఒక ఉద్వేగం అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. అక్టోబర్ 9న మరో 11,063 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేస్తామన్నారు.