అధికారం ఉందని అరెస్ట్‌లు చేస్తే ఎలా?: JD లక్ష్మీనారాయణ
కేటీఆర్‌పై ఫార్ములా ఈ కార్ రేసు కేసు నేపథ్యంలో CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందని ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయొచ్చనేది సరికాదని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఇన్వెస్టిగేషన్‌కు అవసరమైతేనే అరెస్ట్ చేయాలని చెప్పిందని పేర్కొన్నారు. వ్యక్తి అరెస్ట్ వల్ల సమాజంలో అతడి విలువ పడిపోతుందని, ఎందుకు అరెస్ట్ చేస్తున్నామనే పూర్తి వివరాలను కోర్టుకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.