ఏపీ సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గంగూరులో రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ‘ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి నేనే అభిప్రాయాలు సేకరిస్తా. అధికారుల నుంచి నాకు కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదు. రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్‌మెంట్ కనిపించాలి. ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయి. తేమ శాతం, ఇతరత్రా అంశాల్లో కచ్చితత్వం ఉండాలి.’ అని చంద్రబాబు అన్నారు.