అభిమానులపై పవన్ కళ్యాణ్ ఫైర్
AP: అభిమానులు, పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్‌ను చూసి అభిమానులు కేకలు వేశారు. దీంతో ఆయన వారిపై పైర్ అయ్యారు. 'మనుషులు చనిపోయారు. ఇది ఆనందించే సమయమా? ఏడ్చే సమయమా? బాధ అనిపించడం లేదా మీకు? తొక్కిసలాట జరిగినప్పుడు కూడా పోలీసులు జనాలను కంట్రోల్ చేయలేరా?' అంటూ పవన్ ఫైర్ అయ్యారు.