
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ఒకరోజు ముందు ఢిల్లీలో హైడ్రామా
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ఒకరోజు ముందు ఢిల్లీలో హైడ్రామా నెలకొంది. బీజేపీ ఆపరేషన్ లోటస్‌కు కుట్రలు పన్నుతోందని, ఎమ్మెల్యేలను కొనేందుకు కుట్రలు చేస్తుందని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఈ ఆరోపణలపై తాజాగా కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులను కేజ్రీవాల్ లీగల్ టీమ్ ఇంట్లోకి అనుమతించలేదు. ఏసీబీ దగ్గర సరైన పత్రాలు లేవంటూ అభ్యంతరం తెలిపాయి. కేజ్రీవాల్ ఇంటి ముందు చాలా సేపు ఎదురుచూసి.. చివరికి నోటీసు ఇచ్చి ఏసీబీ అధికారులు వెళ్లిపోయారు.