ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లో, 12, 13వ తేదీల్లో అమెరికాలో ఆయన పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. పారిస్‌లో జరిగే కృత్రిమ మేధ సదస్సులో ప్రధాని పాల్గొంటారు. అనంతరం, 13వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అవుతారని సమాచారం.