AI టీచర్లతో ఫస్ట్ స్కూల్.. ఏడాదికి 30 లక్షలు ఫీజు
లండన్‌లోని డేవిడ్ గేమ్ కాలేజ్, ఇండిపెండెంట్ బోర్డింగ్ స్కూల్ UKలో మొదటి టీచర్‌లెస్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించనుంది. ఇక్కడ 20 మంది GCSE విద్యార్థులకు గురువుగా మార్గనిర్దేశం చేసేందుకు కృత్రిమ మేధస్సు (AI) వినియోగించనున్నారు. మానవ ఉపాధ్యాయులకు బదులుగా, AI ప్లాట్‌ఫామ్స్ వ్యక్తిగతీకరించిన పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తాయి. ఈ స్కూల్లో ప్రతి విద్యార్థికి ఏడాది ఫీజు దాదాపు రూ.30 లక్షలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.