TG: అసెంబ్లీలో రచ్చ రచ్చ.. దూసుకొచ్చిన BRS నేతలు (VIDEO)
తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొంది. ఫార్ములా-ఈ కార్ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదు చేయడంతో చర్చ పెట్టాలని BRS నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే హరీశ్ రావు సహా మిగతా ఎమ్మెల్యేలు సిబ్బందిని తోసుకుంటూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. దీంతో మార్షల్స్, BRS నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తాజాగా ఈ వీడియోను ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్దేశ్యపూర్వకంగానే బీఆర్ఎస్ సభలో గందరగోళం సృష్టిస్తోందని మండిపడింది.