ALERT: కొత్త వైరస్ కలకలం.. మాస్క్ పెట్టుకోవడం లేదా?
చైనాలో HMPV వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్ విజృంభణతో ఇండియాలో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో జలుబు, దగ్గు ఉన్నవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం సూచించింది. అయితే అందరూ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం ఉత్తమం. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఉండేవారు పెట్టుకోవాలి. ఈ HMPV వైరస్ మనదగ్గర లేకపోయినా, చలికాలం కావడంతో రకరకాల ఫ్లూలు, వైరస్లు వచ్చే అవకాశం ఉంది.