జీన్స్ ధరించి పడుకోవడం వల్ల అసౌకర్యమే కాకుండా.. ఆరోగ్యపరంగానూ కొన్ని సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే బిగుతైన దుస్తుల వల్ల శరీర భాగాలకు సరిగ్గా గాలి తగలక.. అక్కడి చర్మంపై దురద, దద్దుర్లు, ఎరుపెక్కడం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. అలాగే జీన్స్ వల్ల చెమట పట్టి.. చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.