Top 10 viral news 🔥
కల్కి సినిమా మీద సంచలన వ్యాఖ్యలు చేసిన అనంత శ్రీరామ్ (వీడియో)
AP: కల్కి సినిమాపై సీనీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఆదివారం హైందవ శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కల్కి సినిమాలో హైందవ ధర్మంపై దాడి జరుగుతుంది. ఆ సినిమాలో కర్ణుడి పాత్రను ఎక్కువ చేసి చూపించడం నాకు నచ్చలేదు. దానిని చూసి సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా' అని వ్యాఖ్యానించారు