మరికాసేపట్లో పెళ్లి.. వరుడికి షాకిచ్చిన వధువు

82చూసినవారు
మరికాసేపట్లో పెళ్లి.. వరుడికి షాకిచ్చిన వధువు
ఉత్తరప్రదేశ్‌లో మరికొద్ది క్షణాల్లో పెళ్లి పెట్టుకుని వధువు తన తల్లితో కలిసి పారిపోయింది. మొదటి భార్యను కోల్పోయిన కమలేష్ (40) మధ్యవర్తికి రూ.30 వేలు కమీషన్ ఇచ్చి రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి ఖర్చులు కూడా తానే భరిస్తానని మాటిచ్చాడు. వధువుకు చీరలు, బ్యూటీ ప్రొడక్ట్స్, ఆభరణాలు కొనిచ్చాడు. గోరఖ్‌పూర్‌ భరోహియాలోని శివాలయం వద్ద వివాహ వేడుక మొదలైంది. వధువు మంచిగా తయారై బాత్రూంకి వెళ్లొస్తా అని చెప్పి తల్లితో కలిసి పరారైంది.

సంబంధిత పోస్ట్