ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి.. కాలువలో పడ్డ యువకులు

51చూసినవారు
ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి.. కాలువలో పడ్డ యువకులు
సెల్ఫీ పిచ్చి ఇద్దరు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. తెలంగాణ ఖమ్మం జిల్లా లోకారం సమీపంలోని NSP కాలువ వద్దకు సెల్ఫీలు దిగేందుకు ముగ్గురు యువకులు వచ్చారు. ఈ క్రమంలో సెల్ఫీ దిగుతుండగా ఇద్దరు కాలుజారి కాలువలో పడిపోయారు. కాగా, కాలువలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని స్థానికులు రక్షించారు. అయితే ఈ ఘటనలో  శివ అనే మరో యువకుడు గల్లంతయ్యాడు.

సంబంధిత పోస్ట్