TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడవక ముందే రూ. 1.38 లక్షల కోట్ల అప్పు చేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ఏడాదికి రూ. 41 వేల కోట్లు అప్పు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి రూ. 1.38 లక్షల కోట్లు అప్పు చేసిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లల్లో కేవలం రూ. 4.17 లక్షల కోట్లు అప్పు మాత్రమే చేసిందని వ్యాఖ్యానించారు.