నిజానికి జరిగేది వేరు.. వార్తల్లో వచ్చేది వేరు: కొలికపూడి
AP: తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి టీడీపీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. క్రమశిక్షణ కమిటీ విచారణ అనంతరం సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరి 11న జరిగిన ఘటన వేరు.. వార్తల్లో వచ్చేది వేరని చెప్పారు. తిరువూరు ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసని వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులకు రాతపూర్వకం, నేరుగా కలిసి వివరణ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.