నాతో బలవంతంగా సంతకాలు చేయించారు: సంజయ్ రాయ్

63చూసినవారు
నాతో బలవంతంగా సంతకాలు చేయించారు: సంజయ్ రాయ్
ఆర్జీకర్‌ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ సోమవారం కోల్‌కతా కోర్టులో శిక్ష ఖరారు చేయడానికి ముందు తన వాదనను వినిపించాడు. తాను ఏ నేరం చేయలేదని ఈ సందర్భంగా సంజయ్‌ కోర్టుకు వెల్లడించాడు. "నాతో బలవంతంగా కాగితాలపై సంతకాలు చేయించి.. నన్ను ఇందులో ఇరికించారు. నేను అమాయకుడిని. నేను ఎప్పుడూ రుద్రాక్ష ధరిస్తాను. నేను నేరం చేసి ఉంటే.. అవి ఘటనాస్థలంలోనే ఊడిపోయి ఉండేవి. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు." అని అన్నాడు.

సంబంధిత పోస్ట్