ఘోర రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి

85చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి
TG: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుడిహత్తూర్ మండలానికి చెందిన ఆదివాసీలు ఆదివారం రాత్రి.. నార్నూర్ మండలంలోని జంగుబాయి దైవ దర్శనానికి వెళ్తుండగా డీసీఎం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 47 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటీన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.