మంత్రి పదవి రావడం లేదని క్యాంప్ ఆఫీసును కూలగొట్టిన కోమటిరెడ్డి (వీడియో)

79చూసినవారు
TG: నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును కూలగొట్టి మళ్లీ నిర్మించనున్నారట. ఈ మేరకు సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయాన్ని కూలగొట్టించారట. ఇదంతా ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి రావడం లేదని, క్యాంపు ఆఫీసుకు వాస్తుదోషం ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది నిజమో.. కాదో? అనే దానిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్