నిరుద్యోగ యువతకు రూ.8,500: కాంగ్రెస్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. నిరుద్యోగులకు యవ ఉడాన్ యోజన కింద రూ.8,500 ఇస్తామని ప్రకటించింది. ఇది ఉచితంగా ఇచ్చే మొత్తం కాదని వెల్లడించింది. ఏదైనా కంపెనీ లేదా ఫ్యాక్టరీలో తమకు ఉన్న నైపుణ్యాలను చూపించిన యువతకు ఆర్థిక సాయం చేస్తామని తెలిపింది.