Top 10 viral news 🔥
కాబోయే సీఎం లోకేషే: మంత్రి టీజీ భరత్
AP: ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా కాబోయే ముఖ్యమంత్రి లోకేషేనని మంత్రి టీజీ భరత్ అన్నారు. స్విట్జర్లాండ్ జ్యూరిచ్‌లో పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'కచ్చితంగా టీడీపీ కొన్ని దశాబ్దాల పాటు పాలిస్తుంది. లోకేష్ మంచి విద్యావంతుడు. 175 ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీల్లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన వాళ్లు లోకేష్ తప్ప ఎవరూ లేరు. భవిష్యత్తు లోకేష్‌దే. కాబోయే సీఎం కూడా ఆయనే' అని తెలిపారు.