తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వెంకట్ రెడ్డి మీరు ఒకసారి నల్గొండ జిల్లాలో ఎక్కడికైనా రైతుల దగ్గరకు సెక్యూరిటీ లేకుండా పోయి రా.. నీ బట్టలు అలానే ఉంటాయో లేదో చూద్దామని ఎద్దేవా చేశారు. మీరు చేస్తున్న మోసాలకు, చెత్తపనులకు ఎప్పుడు బుద్ధి చెబుతామని రైతులు ఎదురు చూస్తున్నారని దుయ్యబట్టారు.