AP: ఎమ్మెల్యే ముందు జనసేన కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. గూడురు మండలానికి చెందిన టీడీపీ అధ్యక్షులు పోతన స్వామినాయుడు వేధింపులు తాళలేక.. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఎదుట సంతోష్ అనే జనసేన కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. దీంతో సంతోష్‌ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.