లేఅవుట్ లకు అనుమతులు పొందడానికి ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం ఆత్మకూరు మండల పరిధి భార్గవి నగర్ విశ్వభారతి స్కూల్ సమీపంలో వేసిన లేఔట్ ను అయన తనిఖీ చేశారు. అనుమతుల కోసం సదరు లేఔట్ యజమానులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయికి వెళ్లి ముందస్తు తనిఖీలు చేశారు. కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.