విషాదం.. కల్తీ మద్యం తాగి 8 మంది మృతి
బీహార్ లో మరోసారి కల్తీ మద్యం కలకలం రేపింది. రాష్ట్రంలోని సరన్, సివాన్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. సివాన్లో ఆరుగురు మరణించగా, సరన్ జిల్లాలో ఇద్దరు మరణించినట్టు అధికారులు తెలిపారు. మరో 12 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉండగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.