యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన వికాస్ గార్గ్ అనే వ్యక్తికి ఢిల్లీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. పిస్తా పప్పుల ప్యాకెట్‌ను ఆయన కొనుగోలు చేశాడు. ప్యాకెట్‌ను తెరిచి చూడగా, పిస్తా పప్పులలో పురుగులు కనిపించాయి. దీంతో కస్టమర్ షాక్ అయ్యాడు. ఈ వీడియోను వికాస్ గార్గ్ సోషల్ మీడియాలో ద్వారా పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.