ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు: సీఎం చంద్రబాబు

1050చూసినవారు
ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు: సీఎం చంద్రబాబు
ఏపీలో ఉచిత ఇసుక విషయంలో కూటమి ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటే ఎవరినీ వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎడ్ల బండి ద్వారా ఎవరైనా ఇసుకను తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. వారిపై కేసులు పెడితే అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. దీనిలో ఎవరి పెత్తనాన్నీ సహించబోమన్నారు. ఎవరి ఊరిలో వాళ్లకు ఇసుక తీసుకెళ్లే స్వేచ్ఛ వారికి ఉంటుందని, ఇందులో ఎవరి ప్రమేయం అక్కర్లేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్