అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్
AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ పార్టీ అధినేత జగన్ షాకిచ్చారు. ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాకిస్తూ.. సత్తెనపల్లికి కొత్త ఇన్ఛార్జ్ను నియమించారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నియమించారు. అంబటి రాంబాబును పక్కన పెట్టి భార్గవరెడ్డికి బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.