మకర సంక్రమణ సమయంలో.. కాంతమలైగా పిలిచే పొన్నంబలమేడుపై జ్యోతి రూపంలో దర్శనమిచ్చే అయ్యప్పస్వామి దర్శనానికి భక్తులు శబరికొండకు తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న భద్రతకు తోడు అదనంగా 5 వేల మందిని మోహరించింది. జ్యోతి దర్శనం సాయంత్రం 6-7 గంటల మధ్య జరగనుంది. దీని కోసం లక్ష మందికిపైగా అయ్యప్ప భక్తులు వస్తారని అంచనా.