

నాదెండ్ల మనోహర్ బియ్యం దొంగ, లంచాల కోరు: అంబటి రాంబాబు (వీడియో)
AP: మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం దొంగ, లంచాల కోరు అని అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బస్తాలకు బస్తాలు బియ్యం మెక్కుతున్న నాదెండ్ల మనోహర్ కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. ఇది సరైన విధానం కాదని అంబటి పేర్కొన్నారు. నాదెండ్ల ఉపన్యాసాలు చెబుతుంటే పక్కన నిలుచున్న సీనియర్ నేతలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారన్నారు.