పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం (వీడియో)

60చూసినవారు
TG: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రాయపర్తి మండలం కేశవాపురం గ్రామంలో భూక్యా మల్లన్న(45), సభవాత్ బాలి అనే రైతుల మధ్య బోర్ విషయంలో గొడవ జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అక్కడ ఎస్ఐ శ్రావణ్ కుమార్ భూక్యా మల్లన్నను మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన మల్లన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు మల్లన్నను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఎస్ఐపై సీఐ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్